Saturday, January 18, 2025
HomeTrending Newsనేతన్నలను ఆదుకోండి: నారా లోకేష్

నేతన్నలను ఆదుకోండి: నారా లోకేష్

ప్రతి చేనేత కుటుంబానికి నెలకు పది వేల రూపాయల కరోనా ఆర్ధిక సాయాన్ని అందజేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సుమారు 50 వేలకు పైగా ప్రోత్సాహకాలను, రాయితీలను అందజేశామని, జగన్ ప్రభుత్వం వాటిని నిలుపుదల చేసి ఏడాదికి 24  వేల రూపాయలు చేతిలో పెట్టి పండగ చేసుకోమంటున్నారని ఎద్దేవా చేశారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. నేతన్న నేస్తం పథకం కూడా అర్హులందరికీ అందడంలేదని, ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయని, మజూరీ, రాయితీలు ఆగిపోయాయని అయన ఆరోపించారు.

ప్రతి నేత కుటుంబానికి  సొంతం మగ్గం ఏర్పాటుకు లక్షా యాభై వేల రూపాయలు సబ్సిడీ రుణం ఇవ్వాలని, నెలకు 10,000 రూపాయలు కరోనా సాయం ఇచ్చి ఆదుకోవాలని ఎన్నోసారు ఈ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా కనీస స్పందన లేదని లోకేష్ అన్నారు.  కనీసం ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిశీలించి నేతన్నను ఆదుకోవాలని సిఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ప్రతి నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం’ అందించి అదనంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించాలని లోకేష్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్