Sunday, January 19, 2025
HomeTrending Newsవెంటిలేటర్ పై తెలుగుదేశం: విజయసాయి

వెంటిలేటర్ పై తెలుగుదేశం: విజయసాయి

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అందుకే కల్లోలం సృష్టించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  గత టీడీపీ హయాంలో ప్రజా కంఠక పాలన సాగిందని, అందుకే తమ ప్రభుత్వం చేసే మంచి చంద్రబాబుకి నెగెటివ్ గా కనిపిస్తోందని విజయసాయి అన్నారు. 2019 నుంచి టిడిపిని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయని గుర్తుచేశారు. రెండవ రోజు జనాగ్రహ దీక్షలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం ఇసుక తోటలో జరిగిన దీక్షలో విజయసాయితో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా ఉండాలని, కానీ లోకేష్ అసహ్యకరమైన భాషతో ట్వీట్లు చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుదేనన్నారు.

గుజరాత్ లోని ముందరా పోర్టులో దొరికిన డ్రగ్స్ తో వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్సార్సీపీకి సంబంధం ఉందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస రావు ప్రకటించారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ చేశారు.  చంద్రబాబు హయాంలో గంజాయి సాగు జరగలేదా అని అవంతి ప్రశ్నించారు. అప్పుడు మీరు ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చంద్రబాబు, లోకేష్ కంకణం కట్టుకున్నారని అవంతి ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్