ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రోజుకో అంశంపై నిరసన వ్యక్తం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ నేడు రైతుల సమస్యపై ఆందోళన చేపట్టింది. ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడు, లోకేష్, రామానాయుడు, బిటెక్ రవి, అర్జునుడు, తదితర నేతలు ఎడ్డ బండి కాడికి మోస్తూ అసెంబ్లీ వరకూ వచ్చారు. రైతు ద్రోహి జగన్ మోహన్ రెడ్డి, ధాన్యం బకాయిలు చెల్లించాలి, రైతుల ఆత్మహత్యలు నివారించలేని ప్రభుత్వం డౌన్ డౌన్, రైతుల మోటార్లకు మీటర్లు బిగించిన ప్రభుత్వం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.
మరోవైపు తెలుగు రైతు ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు టిడిపి కార్యకర్తలను అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Also Read: రైతులకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా పథకం: సిఎం