Sunday, November 3, 2024
HomeTrending Newsలైంగిక ఆరోపణలు: కోనేటి ఆదిమూలంపై టిడిపి వేటు

లైంగిక ఆరోపణలు: కోనేటి ఆదిమూలంపై టిడిపి వేటు

సత్యేవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తన నియోజకవర్గానికే చెందిన టిడిపి మహిళా నేతను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఆదిమూలం ఎదుర్కొంటున్నారు. బాధిత మహిళ నేడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో దీనికి సంబంధించిన ఆధారాలు విడుదల చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ నాయకత్వం వెంటనే దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలను ఆదేశించింది, బాధిత మహిళ ప్రెస్ మీట్ పెట్టిన రెండు మూడు గంటల్లోనే ఆయనపై చర్యలు తీసుకుంది. సదరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీవివాసరావు ఓ లేఖ విడుదల చేశారు.

సత్యవేడు నియోజకవర్గ టిడిపి అధ్యక్షురాలిగా ఉన్న తాను ఎన్నికలకు ముందు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం అక్రమాలపై పోరాటం చేశానని, ఆయన టిడిపిలో చేరినపుడు టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశానని, అయినా ఆయన అభ్యర్ధిత్వం ఖరారు కాగానే గెలుపు కోసం పని చేశానని బాధిత నేత వరలక్షి మీడియా ఎదుట వెల్లడించారు. గత సంఘటనలు మనసులో పెట్టుకొని జులై 6, 17 తేదీల్లో రెండుసార్లు  తిరుపతిలోని భీమాస్ హోటల్  రూమ్ కు పిలిచి బలాత్కారం చేశారని వాపోయారు. ఈ విషయం తన భర్తకు చెబితే ఆయన పెన్ కెమెరా ఇచ్చారని దీంతో ఆగస్ట్ 1౦న వీడియో రికార్డు చేశానని వివరించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబును ఆమె కోరారు. దీనిపై వెంటనే స్పందించి ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్