తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని బిజెపి రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ స్పష్టం చేశారు. జన సేన పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ సంఘటన తరువాత తమ పార్టీకి చెందిన చాలా మంది నేతలు పవన్ తో మాట్లాడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు పెద్ద తేడా లేదని, రెండూ కుటుంబ, అవినీతి పార్టీలేనని ఆయన విమర్శించారు. ‘ ఆ రెండూ దొంగలు పార్టీస్’ అంటూ అభివర్హించారు. భారత దేశం నుంచి కుటుంబ, అవినీతి పార్టీలను పారదోలాలని ప్రదాని మోడీ ఎర్రకోట నుంచి సందేశం ఇచ్చారని అయన ప్రస్తావించారు. అధికార పార్టీ రౌడీయిజం ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. వైసీపీ, టిడిపిల్లో ఒకరు నాగరాజు అయితే, మరొకరు సర్పరాజు అంటూ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న ఢిల్లీ వెళ్ళారు. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అయిన అనతరం నేటి ఉదయం సునీల్ దియోధర్ తో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.
Also Read : కలిసి పోరాడదాం: బాబు-పవన్