Sunday, May 19, 2024
HomeTrending Newsరిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

మునుగోడు ఉప ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు కేటాయించిన బేబీ వాకర్ స్థానంలో రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి , మునుగోడు రిటర్నింగ్ అధికారికి సూచించిన కేంద్ర ఎన్నికల సంఘం.

తనకు మొదట రోడ్డు రోలర్ కేటాయించి, ఆతర్వాత బేబీ వాకర్ గుర్తును కేటాయించారని ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసిన స్వతంత్ర అభ్యర్థి కె. శివకుమార్. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం అసహనం. తనకు లేని అధికారాలతో రిటర్నింగ్ అధికారి గుర్తును మార్చడం పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

మిర్యలగూడ ఆర్డీవో కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగిస్తు ఎన్నికల కమిషన్ నిర్ణయం. జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్ కు బాధ్యతలు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావు పై వేటు వేసిన ఎన్నికల కమిషన్.

Also Read : రోడ్డు రోలర్ పై తెరాస అభ్యంతరం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్