Saturday, November 23, 2024
HomeTrending Newsబీజేపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ఘన విజయం

బీజేపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ఘన విజయం

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి 1,169 ఓట్లతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్  సరూర్ నగర్ మినీ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకూ సాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి లకు భారీగా ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డి 7,505 ఓట్లతో ముందంజలో ఉండగా.. పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మాణిక్ రెడ్డి 4569 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.  మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. రెండో ప్రాధాన్యాత ఓటింగ్ లో… బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డి పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్న కేశవరెడ్డిపై 1,150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఏ అభ్యర్థికి సరైన మెజారిటీ లభించకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఏవీఎన్ రెడ్డిని విజేతగా అధికారులు ప్రకటించారు.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉపాధ్యాయులు సరిగా ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ MLC ఎన్నికల్లో చెల్లని ఓట్లు 452 నమోదయ్యాయి. దాదాపు 2 వేల వరకు చెల్లని ఓట్లు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్