Saturday, November 23, 2024
HomeTrending Newsహరీష్ నిజంగా వస్తే పరువు పోతుంది: అశోక్ బాబు

హరీష్ నిజంగా వస్తే పరువు పోతుంది: అశోక్ బాబు

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒకవేళ నిజంగా ఏపీ వచ్చి అడిగితే రాష్ట్ర  ప్రభుత్వ పరువు పోతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు వ్యాఖ్యానించారు.  ఏపీలో ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు  కామెంట్ చేయడం, దీనిపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇక్కడకు స్వయంగా వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుందని బొత్స హరీష్ కు సూచించారు. బొత్స కౌంటర్ పై అశోక్ బాబు నేడు స్పందించారు.  ఉపాధ్యాయులకు టీచింగ్ తో పాటు బ్రాందీ షాపుల దగ్గర క్యూలు నియంత్రించడం, నాడు-నేడు కింద బాత్ రూమ్ లు ఫోటోలు తీసి పంపడం లాంటి పనులు వారితో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచిందని, దీనిపై ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు తమ పదవీ విరమణ వయస్సు గతంలోనే 60గా ఉన్న విషయాన్ని  చెప్పి తమకు మరో రెండేళ్ళు పెంచాలని అడిగారని, ఈ ప్రభుత్వం ఉద్యోగులందరికీ విరమణ వయసును పెంచిందని అశోక్ బాబు  వివరించారు. అన్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని, ఉద్యోగుల జీపీఎఫ్ ను ఉద్యోగుల ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నాని ఆరోపించారు.

ఏ రకంగా చూసుకున్నా రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, హరీష్ రావు విజయవాడకో, తిరుపతికో, విశాఖకో వచ్చి ఇక్కడి ఉపాధ్యాయులను అడిగితే వారు ఇంకా వాస్తవాలు చెబుతారని అప్పుడు ప్రభుత్వం ఏమీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందని అశోక్ బాబు అన్నారు. తెలంగాణ మంత్రులు ఏపీ గురించి నెగెటివ్ గా మాట్లాడడం సర్వ సాధారణమై పోయిందన్నారు.

Also Read : ఇక్కడకు వచ్చి చూడాలి: హరీష్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్