Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్సిఎం రేవంత్ తో సిరాజ్

సిఎం రేవంత్ తో సిరాజ్

టీమిండియా పేస్ బౌలర్, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్… ప్రధానితో భేటీ, ముంబైలో విజయోత్సవాల అనంతరం  రెండు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.

నేడు జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి వచ్చి కలుసుకున్న సిరాజ్…  వరల్డ్ కప్ విశేషాలను ఆయనతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన జెర్సీ నెంబర్ టీ షర్టును రేవంత్  కు బహుకరించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ సిరాజ్ ను సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్