Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్సాధన మొదలుపెట్టిన టీం ఇండియా

సాధన మొదలుపెట్టిన టీం ఇండియా

భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు గురువారం తమ ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత మూడు నాలుగు రోజులపాటు ఒంటరిగా గడిపిన ఆటగాళ్ళు నిన్న కాసేపు ఒకరినొకరు కలుసుకున్నారు. ఇవాళ మైదానంలో దిగి సాధన మొదలుపెట్టారు.

ఈనెల 18 నుంచి 22 వరకూ సౌతాంప్టన్ లో భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  ఫైనల్ మ్యాచ్ కు మన జట్టు ముమ్మర సాధన మొదలుపెట్టిందని, హోరాహోరి తలపడడానికి సిద్ధంగా ఉన్నామంటూ బిసిసిఐ ఓ వీడియో విడుదల చేసింది.

ఈ వీడియో లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఛతేస్వర్ పుజారా, రిషబ్ పంత్, బౌలర్లు ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, బుమ్రా, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ సాధన చేస్తూ కనబడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్