Saturday, January 18, 2025
HomeTrending Newsప్రమాదం వార్తలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్ టీమ్

ప్రమాదం వార్తలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్ టీమ్

టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది.  గత రాత్రి జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ గాయపడ్డారని, ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కొద్దిసేపటి క్రితం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది.

దీనిపై ఎన్టీఅర్ టీమ్ స్పందించింది. ఇటీవల జిమ్ లో ఆయన మణికట్టుకు గాయమైనదని, అలాగే ఆయన దేవర షూటింగ్ లో పాల్గొని పూర్తిచేశారని, కొద్దికాలం విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని వెల్లడించింది. అయన సురక్షితంగా ఉన్నారని, త్వరలోనే మిగిలిన సినిమాల షూటింగ్ లో పాల్గొంటారని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్