Wednesday, May 21, 2025
HomeTrending News12, 13 తేదీలలో శాసనసభ సమావేశాలు

12, 13 తేదీలలో శాసనసభ సమావేశాలు

సెప్టెంబర్ 12, 13 తేదీలలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరి కమిటీ (BAC) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 16 నుండి 3 రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైఖ్యత ఉత్సవాలు ఉన్నందున సెప్టెంబరు 12,13 తేదీలలో శాసనసభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన శాసనసభ భవనంలోని స్పీకర్ చాంబర్ లో సమావేశమైన బిజినెస్ అడ్వైజరి కమిటీ (BAC). సమావేశంలో పాల్గొన్న ఉప సభాపతి టి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, MIM శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

Also Read :  అసెంబ్లీ సోమవారానికి వాయిదా

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్