Monday, January 20, 2025
HomeTrending Newsవ‌చ్చే నెల తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు

వ‌చ్చే నెల తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు వ‌చ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. శాస‌న‌స‌భ ప్రారంభం రోజే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు స‌మాచారం అందించారు.

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్ర‌తిపాద‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌మీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్