తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అయింది. గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశానికే ధాన్యాగారం తెలంగాణ. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. తలసరి ఆదాయం 3 లక్షలకు పైగా పెరిగింది. తెలంగాణ ఏర్పాటయ్యాక అభివృద్ధి రేటు రెట్టింపు అయింది. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది.ప్రజా కవి కాళోజీ మాటలతో ప్రారంభించి దాశరథి మాటలతో క్లోజ్ చేసిన గవర్నర్. రైతు బంధుకు అంతర్జాతీయ ప్రశంసలు
మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. 65 లక్షలమంది రైతులకు సాయం అందిస్తున్నాం. రైతు బీమా ద్వారా 5 లక్షలు అందిస్తున్నాం. రైతులకు అన్నివిధాల సాయం అందిస్తున్నాం. వ్యవసాయ రంగం పండుగలా మారింది.రికార్డు టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశాం. కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయి. తెలంగాణలో ఫ్లోరైడ్ లేదని కేంద్ర జలశక్తి మిషన్ ప్రకటించింది. దళిత బంధు దేశంలో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరుగుతోంది. 10 లక్షల రూపాయలు దళిత బంధుగా వాడుకోవచ్చు. మళ్ళీ దీనిని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసరా పథకం ద్వారా వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నాం. ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం పెంచాం
10 శాతం ఎస్టీ రిజర్వేషన్లు పెంచి ఎస్టీలకు న్యాయం చేశాం. నేతన్నలకు సాయం అందిస్తున్నాం. కల్లు గీత కార్మికులకు సాయం చేస్తున్నాం. 5 లక్షలు బీమా అందిస్తున్నాం. నీరా డ్రింక్ ద్వారా అదనపు ఆదాయం అందిస్తున్నాం. ఉచిత విద్యుత్ లాండ్రీలు, సెలూన్లకు అందిస్తున్నాం. బీసీ కమ్యూనిటీ కోసం అనేక పథకాలు తెచ్చాం. కమ్యూనిటీ బిల్డింగులు నిర్మించాం.ఆశా వర్కర్లకు జీతాలు పెంచాం. హోంగార్డులు, అంగన్వాడీలకు , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదలకు పెళ్ళిళ్ళకు ప్రభుత్వం సాయం అందిస్తోంది.
శాసనసభ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం కన్నా రాజ్ భవన్ – ప్రభుత్వం మధ్య సంబందాలపైనే లాబీల్లో ఎక్కువగా చర్చించుకున్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ పథకాల్ని ప్రస్తావించినపుడు అధికార పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.