Tuesday, January 21, 2025
HomeTrending NewsTSEAMCET : తెలంగాణ ఎంసెట్​ ఫలితాలు విడుదల

TSEAMCET : తెలంగాణ ఎంసెట్​ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో ఎంసెట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 3 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యారు.

అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత

ఇంజినీరింగ్‌: బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత

అగ్రికల్చర్‌: బాలురు 84 శాతం, బాలికలు 87 శాతం ఉత్తీర్ణత

అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రకటిస్తామని మంత్రి సబిత ఇంద్రా రెడ్డి వెల్లడించారు. సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సబిత ఈ ఏడాది నిర్ణీత సమయానికే ఫలితాలు ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించామని, మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించామన్నారు. అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబిత తెలిపారు.

ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac చూడవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీరింగ్‌ పరీక్షకు 2,05,405 మంది దరఖాస్తు చేసుకోగా 1,95,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షలకు 1,15,361 మంది అప్లయ్‌ చేసుకోగా 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్