Tuesday, April 1, 2025
HomeTrending Newsఅంబేద్కర్ జయంతి రోజు కొత్త సచివాలయం ప్రారంభం

అంబేద్కర్ జయంతి రోజు కొత్త సచివాలయం ప్రారంభం

సమీకృత కొత్త సచివాలయ భవనాన్ని ఏప్రిల్‌ 14 డా. బీఆర్ అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఏ క్షణమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా పూజలు నిర్వహించే అవకాశం ఉంది. అందుకనుగుణంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. 6 వ అంతస్తును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఫిబ్రవరి 17 వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముందుగా అనుకుంది.

శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి అది వాయిదా పడింది. మరో ముహూర్తం కోసం సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమీకృత కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆయన జయంతి రోజే దాన్ని ప్రారంభించాలని తాజాగా నిర్ణయం జరిగినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్