Sunday, January 19, 2025
HomeTrending Newsమరో మణిహారం పోలీస్ కమాండ్ కంట్రోల్

మరో మణిహారం పోలీస్ కమాండ్ కంట్రోల్

రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను డిజిపి మహేందర్ రెడ్డి,నగర సిపి సి.వి ఆనంద్ తో కలిసిపరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 18వ అంతస్తు వరకు ఫ్లోర్ వైస్ పనులు పరిశీలించారు.
ఈస్ట్,వెస్ట్ గ్రాండ్ ఎంట్రీ పోర్టికో  పనులు పరిశీలించి వేగం పెంచాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని,మీడియా బ్రీఫింగ్ రూమ్,ఆడిటోరియం నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫ్లోర్ వైస్ క్లాడింగ్,ఫాల్స్ సీలింగ్,ఫ్లోరింగ్,మిగిలిన సివిల్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని అదేశించారు.

4వ ఫ్లోర్ లో గల డేటా సెంటర్ కు సంబంధించిన సెక్యూరిటీ అంశాలపై డిజిపి మహేందర్ రెడ్డి,సి.పి సివి ఆనంద్ పలు సూచనలు చేశారు. ఆ అంశాలు పరిగణలోకి తీసుకోవాలని ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి ని మంత్రి అదేశించారు. 7th ఫ్లోర్ సీఎం, వివిఐపి చాంబర్స్,18వ ఫ్లోర్ సి.పి ఛాంబర్,4th ఫ్లోర్ డిజిపి ఛాంబర్ లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

తెలంగాణకు మరో మణిహారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి ప్రముఖ అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలువనుందన్నారు. దుబాయ్ కు బూర్జ్ ఖలీఫా,ప్యారిస్ కు ఈఫిల్ టవర్ ఎలా ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర రాజదాని నడిబొడ్డున హైదరాబాద్ కు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతటి కీర్తిని తెస్తుందని అన్నారు. సందర్శకులకు కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్తు నుండి చూస్తే హైదరాబాద్ నగరం నలువైపులా ఆకర్షణీయంగా కన్పిస్తుందన్నారు. సివిల్ వర్క్స్ దాదాపు పూర్తి కాగా ఫినిషింగ్ వర్క్స్ చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. డేటా సెంటర్ కోసం బెల్జియం,జర్మనీ నుంచి తెప్పించే ఇంపోర్టెడ్ పరికరాలు త్వరగా వచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మ్యాన్ పవర్ పెంచి ఫినిషింగ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని, గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని మంత్రి అదేశించారు. మంత్రి తో పాటు డిజిపి మహేందర్ రెడ్డి,హైదరాబాద్ సిపి సి.వి ఆనంద్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి పలువురు పోలీసు,ఆర్ అండ్ బి అధికారులు,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్