Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం - మంత్రి తలసాని

తెలంగాణలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం – మంత్రి తలసాని

పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుంద‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని హైటెక్స్‌లో నిర్వ‌హించిన ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిష‌న్‌ను మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌ముద్ అలీ క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాలకు సరిపడ పాల ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి అధికారులతో కమిటీ నియ‌మించిన‌ట్లు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక కుటుంబాలకు జీవనాధారంగా పాడి పరిశ్రమ రంగం ఉంద‌న్నారు. ఇలాంటి ఎగ్జిబిష‌న్లు పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఎంతో దోహ‌ద‌ప‌డుతాయ‌న్నారు.
జీవాల ఆరోగ్య పరిరక్షణపై పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యాచరణతో పని చేస్తుందని స్ప‌ష్టం చేశారు. జీవాల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్ళే విధంగా సంచార పశువైద్యశాలలు పని చేస్తున్నాయన్నారు. పాడి రైతులకు లీటర్ పాలకు రూ. 4 నగదు ప్రోత్సాహకం అందిస్తున్నాం.. ఇలా ఇవ్వ‌డం దేశంలో ఎక్కడా లేదన్నారు. మూసివేత దశకు చేరుకున్న విజయ డెయిరీ రూ. 650 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. రూ. 1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేప‌డుతున్నామ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్