Saturday, November 23, 2024
HomeTrending Newsపదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత

పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలను హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఈ రోజు (గురువారం) విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయినవారు, మార్కులు తక్కువ వచ్చిన వారు నేటి నుంచి 15 రోజుల్లోగా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అయితే విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.

రీకౌంటింగ్‌ ఎలా అంటే..
మార్కులు మళ్లీ లెక్కించాలని దరఖాస్తు చేసుకోవాలంటే.. విద్యార్థులు ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి లేదా డీఈవో కార్యాలయ్యాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో అప్లికేషన్‌ ఫామ్‌లు తీసుకోవాలి. దానిపై ప్రధానోపాధ్యాయుడితో సంతకం చేయించాలి. దానికి హాల్‌టికెట్‌ జతచేయాలి. ప్రతి సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఎస్‌బీఐలో హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద చలానా తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ ఫామ్‌ను నేరుగా డీఈఓ ఆఫీస్‌లో అందిచవచ్చు, అదేవిధంగా పోస్ట్‌ ద్వారా కూడా పంపించవచ్చు.

రీవెరిఫికేషన్‌ అప్లికేషన్లు..
రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్రతి పేపర్‌కు రూ.1000 చొప్పున ఎస్‌బీఐలో హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద చలానా తీయాలి. అప్లికేషన్‌ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో కానీ, డీఈవో ఆఫీసులో అందుబాటులో ఉంటాయి. అప్లికేషన్లపై ప్రధానోపాధ్యాయుడితో సంతకం చేయించాల్సి ఉంటుంది. దానికి హాల్‌టికెట్‌ను జతచేసి 15 రోజుల్లోగా పోస్టు ద్వారా కానీ, కొరియర్‌ ద్వారా కానీ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి పంపిచాలి. లేదా నేరుగా సంబంధిత డీఈవో ఆఫీస్‌లో ఇవ్వవచ్చు. రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారు రీకౌంటింగ్‌కు అప్లయ్‌ చేయాల్సిన అవసరం లేదు.

Also Read : ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్