Saturday, November 23, 2024
HomeTrending NewsTelangana Awards:జాతీయ స్థాయి అవార్డుల్లో తెలంగాణ రికార్డు

Telangana Awards:జాతీయ స్థాయి అవార్డుల్లో తెలంగాణ రికార్డు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు

డిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డులు రాష్ట్రపతి అందచేశారు. కేంద్రం ప్రకటించిన మొత్తం 46 అవార్డుల్లో 13 అవార్డులు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రం..9 కేటగిరిలలో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీ లలో తెలంగాణ రాశ్రానికే అవార్డులు దక్కాయి. ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రం..అత్యధిక అవార్డులు సాధించిన తెలంగాణను భారత రాష్ట్రపతి అభినందించారు.

అంతకుముందు, అవార్డు గ్రహీతలకు తేనీటి విందు ఇచ్చిన కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్రానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీతలు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్