Telangana Weather Forecast : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : ఈ రోజు ( సోమవారం) ఉదయం 08:30 ఆధారంగా కింది స్థాయి గాలులు పశ్చిమ /వాయువ్య దిశల నుండి తెలంగాణ వైపుకి వీస్తున్నవి. చౌటుప్పల్ – హైదరాబాద్ నేషనల్ హైవే 65 పైన ఆదివారం మధ్యహ్నం 47 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధిక పగటి ఉష్ణోగ్రతగా భావిస్తున్నారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన:
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అక్కడక్కడ పడతాయి.
వాతావరణ హెచ్చరికలు
ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షంలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.