“గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పై తమ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడం మరియు మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించడం అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ అనుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం” అని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్ తెలిపారు.
“మన తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి కారణంగా మా పరిశ్రమ అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. వివిధ వ్యక్తులు తమ అభిప్రాయాలను, ఆవేదనను వివిధ వేదికలపై వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ యొక్క అభిప్రాయం కాదు. మా పరిశ్రమ యొక్క అపెక్స్ బాడీ రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పునరుద్ఘాటించాలనుకుంటున్నాం. సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించలేం”
“ఈ పరిశ్రమ పై ఆధారపడిన వేలాది మంది ప్రజలు, వారి కుటుంబాలు మార్చి 2020 నుండి బాధపడుతున్నారు. ఈ తరుణంలో మన నాయకులు, ప్రభుత్వాలు పెద్ద మనసుతో వారి నిరంతర మద్దతును అందించడానికి చిత్ర పరిశ్రమకు మద్దతు అవసరం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు మన చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు….. మన గౌరవనీయ ముఖ్యమంత్రులు ఇద్దరూ చురుగ్గా ఉన్నారు…. వారి ప్రోత్సాహం, మద్దతు ఎల్లప్పుడూ మాకు అందించారు. వారి నిరంతర దీవెనలు, మద్దతు కోరుతున్నాం” అని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారంగ్ తెలియచేశారు.