24 Crafts: మే ఒకటిన హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్) తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. దాదాపు పదివేల మందితో భారీ స్థాయిలో మేడే సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, దర్శకుల సంగం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్ లతో పాటు 24 క్రాఫ్ట్ కు చెందిన అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ… అందరికి పండగలు ఉంటాయి ఆలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్ గా సినిమా రంగం అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అన్నారు.
ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ అంటే హీరోలు, ఆడియో ఫంక్షన్లు, రిలీజ్ లు మాత్రమే కాదు.. సినిమా పరిశ్రమ అంటే ఎంప్లాయిస్ ఫిలిం ఫెడరేషన్ దాని కింద పని చేస్తున్న 24 క్రాఫ్ట్స్. జూనియర్ ఆర్టిస్ట్, టెక్నీషియన్, లైట్ బాయ్.. ఇలా అందరు కలిసి పని చేస్తేనే ఒక సినిమా వస్తుంది. దీని కింద చాలా మంది కార్మికులు ఉన్నారని చాలా మంది మరచిపోయారు. ఈ ఫిలిం ఫెడరేషన్ కొత్త కార్యవర్గం ఎన్నికైన తరువాత 24 క్రాఫ్ట్ వారిని కలుపుకుని ముందుకు సాగుతున్నాం. ఇక్కడ 24 క్రాఫ్ట్ కార్మికులం ఉన్నాం అంటూ మేడే వేడుకను అందరం కలిసి గ్రాండ్ గా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా అనుకున్నాం కానీ కోవిడ్ కారణంగా జరపలేదు కానీ ఇప్పుడు 24 శాఖలకు సంబందించిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నారు.