Saturday, January 18, 2025
HomeసినిమాAgent OTT: ఓటీటీ ట్రాక్ పై భారీ యాక్షన్ సినిమాల జోరు!

Agent OTT: ఓటీటీ ట్రాక్ పై భారీ యాక్షన్ సినిమాల జోరు!

ఓటీటీ సినిమాలు .. వెబ్ సిరీస్ ల పట్ల ఇప్పుడు ఆడియన్స్ విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు. నిన్నటి నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బెదురులంక 2012’ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కార్తికేయ – నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో కామెడీని టచ్ చేస్తూ కొనసాగుతుంది. ఇక రేపు .. అంటే 24వ తేదీన ‘గాండీవధారి అర్జున’ సినిమా ‘నెట్ ఫ్లిక్స్’ ద్వారా పలకరించనుంది. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ కథ నడుస్తుంది. వరుణ్ తేజ్ జోడీగా సాక్షి వైద్య నటించింది.

‘గాండీవధారి అర్జున’ సినిమా దాదాపు విదేశాల్లోనే చిత్రీకరించిన సినిమా. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలానే కసరత్తు చేశాడు. కాకపోతే ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక యాక్షన్ జోనర్లో నిర్మితమైన మరో సినిమా ‘సోనీ లివ్’ ద్వారా స్ట్రీమింగ్ కానుంది .. ఆ సినిమా పేరు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ కథ కూడా విదేశాల్లోనే ఎక్కువగా షూటింగు జరుపుకుంది. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ రెండు సినిమాల మధ్యలో .. ఒక సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిత్యామీనన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ వెబ్ సిరీస్ పేరు ‘కుమారి శ్రీమతి’. ఈ నెల 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. స్త్రీ వ్యక్తిత్వం గురించి ఈ కథ నడుస్తుంది. స్త్రీకి కూడా కొన్ని అభిప్రాయాలు .. ఆలోచనలు ఉంటాయి. తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలనే ఒక బలమైన ఆలోచన ఉంటుంది. ఇతరులపై ఆధారపడకుండా జీవించాలనే ఒక పట్టుదల ఉంటుంది. ఆ దిశగా తన జీవితాన్ని కొనసాగించిన నాయిక కథ ఇది. ఇలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మంచి సందడి కనిపించనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్