రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయిందని వాతావరణ శాఖ తెలిసింది. దీంతో ఏజెన్సీ వాసులు వణికిపోతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయిందని అధికారులు చెప్పారు.
ఇక మంచిర్యాల జిల్లాలో 9.9, ఆదిలాబాద్‌లో 10.5, నిర్మల్ జిల్లాలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోనూ క్రమంగా చలితీవ్రత పెరుగుతుండటంతో నగరవాసులు వణికిపోతున్నారు.