jodhpur : రాజస్థాన్ లోని జోధ్ పూర్ నగరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మళ్ళీ చెలరేగాయి. అల్లర్లకు సంబంధం ఉన్న సుమారు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు విస్తరించకుండా పోలీసులు నగరంలో కర్ఫ్యూ విధించారు. గొడవలు ముదరక ముందే గవర్నర్ కల్రాజ్ మిశ్ర జోక్యం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా డిమాండ్ చేశారు. సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ సొంత జిల్లాలోనే అల్లర్లు చోటు చేసుకోవటం దారుణమని, నిందితులపై కటిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు.
ఆల్లర్లతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జోధ్ పూర్ పట్టణంలో సోమవారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నగరంలోని బల్ముకంద్ బిస్సా సర్కిల్ లో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ఓ వర్గం వారు కాషాయ జెండా ఎగవేశారు. అయితే ఈ జెండాను మరో వర్గం వారు తొలగించి ఇస్లామిక్ జెండాను ఎగరవేశారు. దీంతో జలోరి గేట్ ప్రాంతంలో ఘర్షణలు ఏర్పడ్డాయి. రెండు వర్గాల మధ్య సోమవారం అర్థరాత్రి రాళ్లదాడి చెలరేగింది. దీంతో పోలీసులు రెండు వర్గాల వారికి నచ్చచెప్పడంతో ఉద్రిక్తత తొలిగింది.
మంగళవారం రంజాన్ పర్వదినం సందర్భంగా మరోసారి ముస్లింలు తమ నిరసన తెలియజేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పరస్థితిని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సమీక్షిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.
Also Read : త్వరలోనే కర్ణాటక ప్రభుత్వంలో మార్పులు