Tension in Nagaland:
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోన్ జిల్లా ఓటింగ్ లో ఉగ్రవాదులనే అనుమానంతో 13 స్థానిక పౌరులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మరో 11 మంది పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన దరిమిలా స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఆగ్రహావేశాలను లోనై భద్రతా బలగాల వాహనాలకు నిప్పు పెట్టారు.
ఓటింగ్ ఘటన దురదృష్టకరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేప్యు రియో అన్నారు. దీనిపై సిట్ విచారణకు ఆదేశించామన్నారు. అన్ని వర్గాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నాగాలాండ్ లో కాల్పుల సంఘటన దురదృష్టకరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఘటనపై సిట్ దర్యాప్తు చేస్తోందని, నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఆర్మీ అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు, బాధ్యుల గుర్తించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Also Read : నాగాలాండ్ కు టి.ఎం.సి. బృందం