Sunday, January 19, 2025
Homeసినిమారజినీకాంత్ పై విజయ్ సెటైర్లు..

రజినీకాంత్ పై విజయ్ సెటైర్లు..

లోకేష్ కనగరాజు, విజయ్ నటించిన ‘లియో’ సినిమా కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ చిత్రం మేకర్స్ ఏర్పాటు చేసిన ‘లియో’ సక్సెస్ మీట్ లో వీటన్నిటి పైన స్పందించారు విజయ్.కాగా ఈ స్పీచ్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇన్ డైరెక్ట్ గా రజినీకాంత్ ని టార్గెట్ చేసి మాట్లాడినవని సోషల్ మీడియాలో రజనీకాంత్ అభిమానులు అలానే విజయ్ అభిమానులు తెగ కొత్తేసుకుంటున్నారు.

లేటెస్ట్ గా ‘జైలర్’ సినిమా ఆడియో ఫంక్షన్ లో రజినీకాంత్ తన అనుభవం గురించి ”మాట్లాడుతూ… ‘ఒక కాకీ గద్ద కథ’ చెప్తే అది విజయ్ గురించే అంటూ పెద్ద రచ్చ చేసారు. కాకి గాల్లోకి ఎగరగానే ఈ ప్రపంచం మొత్తం తనదే అని అనుకుంటుంది. కానీ ఆ ఆకాశం లో నేను గ్రద్ద లాంటోడిని, నన్ను కాకులు ఏమి చెయ్యలేవు” అంటూ రజినీకాంత్ చెప్పడంతో అది విజయ్ గురించే అని అప్పట్లో అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

లియో సక్సెస్ మీటిలో విజయ్ కూడా రజినీకాంత్ తరహాలోనే ఒక కథ చెప్పాడు. ఆయన ”మాట్లాడుతూ ఒక అడవిలో చాలా క్రూరమైన జంతువులూ ఉన్నాయి. అదే అడివిలో ఒక కాకి.. ఒక గ్రద్ద కూడా ఉన్నాయి అని విజయ్ అనగానే వెంటనే ఇది తప్పకుండా రజినీకాంత్ కి విజయ్ ఇచ్చే కౌంటర్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయి ఆడిటోరియం మొత్తం విజిల్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఒక చిన్న కథను చెబుతూ దానికి సందేశంగా చిన్న ప్రాణిని చంపడం తేలిక.. అదేమీ పెద్ద విజయం కాదు.. అందుకే పెద్ద లక్ష్యాలను పెట్టుకోండి.. ఆ దిశగా అడుగులు వేయండి..” అంటూ విజయ్ అనడంతో.. రజినీకాంత్ కన్నా మా విజయ్ స్పీచ్ సూపర్ గా ఉంది అంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం మొదలు పెట్టాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్