Wednesday, January 22, 2025
Homeసినిమా‘రాధే శ్యామ్’కు థమన్ రీ రికార్డింగ్

‘రాధే శ్యామ్’కు థమన్ రీ రికార్డింగ్

Radhe Shyam- Thaman: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ పిరియాడిక్ మూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. అది ఏంటంటే.. రాధే శ్యామ్ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆర్ఆర్ అందించబోతున్నారు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.  జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేమను వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణమే ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆల్ ఇండియా రికార్డులను బద్ధలుకొడుతుంది. అత్యద్భుతమైన విజువల్స్ అందులో కనిపిస్తున్నాయి. ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. థమన్ ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది అన‌డంలో సందేహం లేదు. ఈ భారీ పిరియాడిక్ మూవీని సంక్రాంతి కానుక‌గా జనవరి 14, 2022న విడుదల చేయ‌నున్నారు.

Also Read : ఆలిండియా రికార్డు సృష్టించిన ‘రాధే శ్యామ్’ ట్రైలర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్