Saturday, September 21, 2024
Homeసినిమాఇటు 'సలార్' .. అటు 'తంగలాన్'

ఇటు ‘సలార్’ .. అటు ‘తంగలాన్’

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ రెడీ అవుతోంది. ఇది పాన్ ఇండియా సినిమా .. మాస్ యాక్షన్ హీరోగా ఇది ప్రభాస్ విశ్వరూపాన్ని చూపిస్తుందని ప్రశాంత్ నీల్ చెప్పడం ఈ ప్రాజెక్టుపై మరింతగా అంచనాలను పెంచేసింది. ఇది బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ. అక్కడ ఆధిపత్య పోరాటం ..  ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా హీరో రంగంలోకి దిగడమే ప్రధానమైన కథ అని తెలుస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఒక డిఫరెంట్ కలర్ టోన్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక బొగ్గుగనుల నేపథ్యంలోనే మరో భారీ ప్రాజెక్టు కూడా కోలీవుడ్ వైపు నుంచి బరిలోకి దిగనుంది. ఆ సినిమా పేరే ‘తంగలాన్’. విక్రమ్ హీరోగా ఈ సినిమా రూపొందింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. 118 రోజులలో షూటింగును పూర్తిచేసినట్టుగా విక్రమ్ చెప్పారు. ఈ సినిమా చేస్తున్నంత సేపు కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపించిందని కూడా ఆయన అన్నారు. దీనిని బట్టి ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెటప్నును ఏ స్థాయిలో సృష్టించారో .. ఏ స్థాయిలో చిత్రీకరించారో అర్థం చేసుకోవచ్చు.

విక్రమ్ మొదటి నుంచి కూడా డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడానికి ఆసక్తిని చూపుతూ వచ్చారు. ‘తంగలాన్’లోను ఆయన చాలా కొత్తగా కనిపించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ‘ఐ’ తరువాత తనని తాను పూర్తిగా మార్చుకుని కనిపించనున్న సినిమా ఇదేనని అనిపిస్తోంది. ఇదీ .. ‘సలార్’ ఈ రెండు సినిమాల నేపథ్యం బొగ్గుగనులే అయినా, ఆ వైపు నుంచి వాళ్లు ఆవిష్కరించే కంటెంట్ ఆసక్తిని పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలు, ప్రభంజనాన్ని సృష్టిస్తాయేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్