Saturday, January 18, 2025
Homeసినిమా'థ్యాంక్యూ' ఎఫెక్ట్ ప‌ర‌శురామ్ పై ప‌డిందా?

‘థ్యాంక్యూ’ ఎఫెక్ట్ ప‌ర‌శురామ్ పై ప‌డిందా?

Affect: అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ‘థ్యాంక్యూ‘ ఇటీవ‌ల రిలీజైంది. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా ఆడియ‌న్స్ కి న‌చ్చుతుందనుకున్నారు కానీ.. ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. ఇంకా చెప్పాలంటే.. నాగ‌చైత‌న్య కెరీర్ లోనే అత్యంత త‌క్కువ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇది ఇటు హీరో నాగ‌చైత‌న్య‌కు, అటు నిర్మాత దిల్ రాజ‌కు పెద్ద షాకే అని చెప్ప‌చ్చు.

అయితే ఈ సినిమా ఫలితంతో  నాగ‌చైత‌న్య ఇక నుంచి క‌థ విష‌యంలో చాలా కేర్ తీసుకోవాలని అనుకుంటున్నార‌ట‌. ముఖ్యంగా ప‌ర‌శురామ్ తో నాగ‌చైత‌న్య ఓ సినిమా చేయాలి. గ‌తంలో చెప్పిన స్టోరీని కాద‌ని కొత్త‌గా మ‌రో క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌, ప‌ర‌శురామ్ మ‌ధ్య క‌థాచ‌ర్చ‌లు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ఫుల్ స్టోరీ రెడీ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ప‌ర‌శురామ్.. నాగ చైత‌న్య‌తో ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడ‌ని.. థ్యాంక్యూ మూవీ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో నాగ‌చైత‌న్య ఆలోచ‌న‌లో మార్పు వ‌చ్చింద‌ని.. అందుచేత ప‌ర‌శురామ్ తో సినిమా ఉండ‌క‌పోవ‌చ్చు అని మ‌ళ్లీ ప్ర‌చారం మొద‌లైంది.

Also Read :  లైఫ్ లో ఒకసారి వెనక్కి వెళ్లమని చెప్పే ‘థ్యాంక్యూ’

RELATED ARTICLES

Most Popular

న్యూస్