సూపర్‌స్టార్ కృష్ణ పెద్దకర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. జేఆర్సీ ఫంక్షన్ హాల్ లో నాలుగు నుంచి అయిదు వేల లోపులో అభిమానులు, జనరల్ పబ్లిక్ కు భోజనాలు పెట్టారు. అభిమానులతో పాటు సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ జనాలు కూడా ఇక్కడకు వచ్చారు. ఇక సినిమా సెలబ్రిటీలు, మీడియా కోసం ఎన్ కన్వెన్షన్ లో భోజనాలు ఏర్పాటు చేసారు. హీరో వెంకటేష్ వచ్చారు. నరేష్, పవిత్రలతో పాటు నరేష్ మాజీ భార్య, పిల్లలు కూడా హాజరయ్యారు. ఇంట్లో పెద్ద కర్మ కార్యక్రమాలు నిర్వహించాక ఇక్కడకు మహేష్ కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ… నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను. నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
Also Read : నాన్న గురించి మహేష్ ఎమోషనల్ పోస్ట్.