Sunday, January 19, 2025
Homeసినిమాఆ ఒక్క మాట వెయ్యి సినిమాలు చేసే శక్తినిచ్చింది – శ్రీపతి కర్రి

ఆ ఒక్క మాట వెయ్యి సినిమాలు చేసే శక్తినిచ్చింది – శ్రీపతి కర్రి

కొరమీను‘ విడుదలైన మరుసటి రోజు మా నాన్న ఫోన్ చేసి, “ఈరోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ తీరిపోయాయిరా” అనడం ‘కొరమీను’ సినిమాకి సంబంధించి మాత్రమే కాదు… నా జీవిదానికి సంబంధించి నేను అందుకున్న అతి పెద్ద కాంప్లిమెంట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్” అంటున్నాడు యువ దర్శకుడు శ్రీపతి కర్రి. తన తొలి చిత్రంతోనే ఓ మోస్తరు “హల్ చల్” చేసిన ఈ వైజాగ్ కుర్రాడు తీసిన రెండో సినిమా “కొరమీను”కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఆనంద్ రవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సమన్యరెడ్డి నిర్మించారు. 2022కి ఘనమైన వీడ్కోలు పలికిన చిత్రంగా ప్రశంసలందుకుంటున్న “కొరమీను” చిత్రం ఇంత బాగా రావడంలో ఈ చిత్ర రచయిత, హీరో అయిన ఆనంద్ రవి, నిర్మాత సమన్య రెడ్డిలకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పే ఈ “ఎమ్.బి.ఎ” కుర్రాడు… ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టాలే పడ్డాడు.

2020లో విడుదలైన “హల్ చల్” చిత్రంతో దర్శకుడై… “చాలా బాగా తీశాడు” అని పేరు తెచ్చుకున్నా… తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కో – డైరెక్టర్ గా పని చేయాల్సి వచ్చినప్పుడూ ఢీలా పడలేదు. సినిమా పిచ్చితో 2006లో హైదరాబాద్ వచ్చేసి… “కొరమీను” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చేంత వరకు… తన ఆత్మవిశ్వాసాన్ని కించిత్ కూడా కోల్పోలేదు.

“పస్తులుండాల్సి వచ్చిన రోజుల్ని… సినిమా రంగంలో సక్సెస్ కావడానికి నేను చేస్తున్న ఉపవాసాలుగా భావిస్తుండేవాడిని” అని చెప్పే ఈ యువ ప్రతిభాశాలి… ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన తన అక్కా-బావ… మిత్రుడు వినోద్, అమ్మానాన్న, తన జీవన సహచరి గురించి చెబుతూ… ఒకింత భావోద్వేగానికి లోనవుతాడు. ముఖ్యంగా తను జాబ్ చేస్తూ… ఫ్యామిలీని నడిపిస్తూ “సపోర్ట్ సిస్టమ్”గా నిలిచిన తన లైఫ్ పార్టనర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటాడు శ్రీపతి. “సినిమా రంగంలో నువ్వు కచ్చితంగా రాణిస్తావురా” అని తనను ఎంతగానో ప్రోత్సహించిన “ఎమ్.బి.ఎ”లో తన గురువు సదానంద్ గారినీ ఇష్టంగా గుర్తు చేసుకుంటాడు. ముచ్చటగా మూడో చిత్రానికి కమిట్ అయిన శ్రీపతి కర్రితో నాలుగో సినిమా చేసేందుకు కూడా ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఆసక్తిగా ఉండడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్