తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైంది. ఎల్ రమణ గులాబి గూటికి చేరుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణ నాయకుల అభిప్రాయం తీసుకున్న చంద్రబాబు రావుల చంద్రశేఖర్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. టిటిడిపి అధ్యక్షుడి నియామకంపై రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టి నాయకుడిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ ఎంపి గా సేవలు అందించిన రావుల 1994 నుంచి 2009 వరకు వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించారు. వనపర్తి శాసనసభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి పై రెండుసార్లు విజయం సాధించారు.