Sunday, September 8, 2024
HomeTrending Newsతూర్పుగోదావరి జిల్లాలో తప్పిన ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా బస్సు వెనుక చక్రాలు రెండూ ఒక్కసారిగా ఉడాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సుని కంట్రోల్ చేయగలిగాడు. బస్సు చక్రాలు ఊడినప్పుడు పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులతో పాటు, అక్కడ ఉన్న స్థానికులు కూడా భయపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు సంభవించలేదు. ప్రమాద సమయంలో బస్సులు సుమారు 30 మంది ప్రయాణీకులున్నారు. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరిని వేరే బస్సులో వారి గమ్య స్థానాలకు తరలించారు.

ఏపీఎస్‌ఆర్టీసీ చక్రాలు ఊడిపోయే పరిస్థితులు నెలకొన్నా వారు బస్సుల కండిషన్ గురించి పట్టించుకోవడం పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ నిర్లక్ష్యం పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్