Bjp Government Should Refrain :
కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశప్రజలకు క్షమాపణలు చెప్పి ప్రధాని నరేంద్రమోడీ ఉపసంహరించుకున్నారని, ఏడాది కాలంగా వీటిని సమర్థిస్తూ మాట్లాడిన బిజెపి రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా బిజెపి కండ్లు తెరిచి రైతు సమస్యలు తెలిసిన, రైతు ప్రయోజనాలు కాపాడే నేతలను పిలిపించుకుని మాట్లాడి రైతుమేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, తాళ్ల ఊకళ్లు గ్రామంలో ఉమామహేశ్వర దేవస్థానంలో లింగ పున:ప్రతిష్ట, ధ్వజస్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాటలు..
బిజెపి ప్రభుత్వం కొంతమంది ప్రయోజనాల కోసం పనిచేయడం మానుకోవాలి. లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారు, విలాసవంతమైన జీవితం గడిపేందుకు వీలుగా విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి వారికోసం కాకుండా రైతుల కోసం, సామాన్యుల కోసం పనిచేస్తే మంచిది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇప్పటికైనా బిజెపి నేతలు కండ్లు తెరిచి వ్యవసాయానికి, రైతుకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు శ్రీనివాసరెడ్డి, యాదగిరి రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, మనోజ, సత్యనారాయణ రెడ్డి, గ్రామ ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఇది రైతుల విజయం – మంత్రి నిరంజన్