Sunday, January 19, 2025
HomeTrending News25శాతం బియ్యం ఎప్.సి.ఐ కి అందజేత

25శాతం బియ్యం ఎప్.సి.ఐ కి అందజేత

యాసంగి ధాన్యం మిల్లింగ్ పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి నిలిపింది, మిల్లింగ్ వేగవంతం చేయడం కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మిల్లింగ్ వివరాల్ని కమిషనర్ మంత్రికి తెలియజేశారు, ఈ యాసంగిలో రైతుల వద్దనుండి రికార్డు స్థాయిలో 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఈ ధాన్యం మొత్తం మిల్లులకు చేర్చామని, ఇప్పటికే ఎఫ్.సి.ఐ కు 25 శాతం బియ్యాన్ని అందజేసామన్నారు.

రోజుకు 21వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ అవుతుందని మంత్రికి వివరించారు. దీన్ని మరింత వేగంగా చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్.సి.ఐకు అందించేందుకు కావాల్సిన అన్ని చర్యల్ని తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశించారు. అలాగే రాబోయే వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణ, గన్నీల అందుబాటు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలతో నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. గత వానాకాలంలో ఎప్.సి.ఐకు అందజేయాల్సిన 2.96 లక్షల మెట్రిక్ టన్నులపై మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో చర్చించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్