Friday, March 29, 2024
HomeTrending Newsరక్షణ శాఖలో మహిళా సాధికారత

రక్షణ శాఖలో మహిళా సాధికారత

సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్​ఓ) తొలిసారిగా ఆర్మీ మహిళా అధికారి ఆయినా ని ఆఫీసర్​ ఇన్ కమాండింగ్​గా నియమించినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్​లోని 75 రహదారి నిర్మాణ సంస్థ(ఆర్​సీసీ)కు ఈ అధికారిని నియమించినట్లు తెలిపింది. మేజర్​ ఆయినా సారథ్యంలో కెప్టెన్​ అంజనా, భావన జోషి, విష్ణుమయ కేలకు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది.

ఆగస్టు 30నే ఈ అధికారుల నియామకం ఖరారు కాగా.. ఈ ఏడాదిలో మహిళా అధికారుల నియామకానికి సంబంధించిన జాబితాను మరోసారి విడుదల చేసింది బీఆర్​ఓ. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్​ఓ) తమ సంస్థలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం కల్పిస్తోందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫీసర్ల నుంచి కమర్షియల్ పైలట్​ లైసన్స్​ హోల్డర్స్ వరకు చాలా మందిని నియమిస్తోందని స్పష్టం చేసింది.

“జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ ఆఫీసర్ వైశాలి ఎస్ హివాసే.. ఏప్రిల్ 28న 83 రహదారి నిర్మాణ సంస్థకు అధికారిగా నియమితులయ్యారు. మునిసైరి-బుగ్దియార్-మిలమ్ ప్రాంతాలను కలిపే భారత్-చైనా కీలక రహదారికి ఆమెను అధికారిగా నియమించారు. ఛాలెంజింగ్​గా ఉండే ఈ ప్రాంతంలో మహిళా అధికారి తమ టీమ్​తో విధులు నిర్వర్తిస్తున్నారు” అని రక్షణ శాఖ ప్రకటనలో పేర్కొంది.

శివాలిక్​ ప్రాజెక్టు పనులు చేపట్టిన మేజర్ ఆయినా.. తొలిసారిగా ఆఫీసర్​ ఇన్ కమాండింగ్​గా నియమితులయ్యారు. ఉత్తరాఖండ్​ చమౌలీ జిల్లాలోని పిపాల్​కోటి 75 రోడ్​ కన్​స్ట్రక్షన్ కంపెనీస్​కు ఆమె అధికారిగా ఉంటారు. మిగతా ముగ్గురు మహిళా అధికారులు కూడా బీఆర్​ఓలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో.. మహిళా సాధికారత దిశగా బీఆర్ఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ తమ ప్రకటనలో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్