Sunday, November 24, 2024
HomeTrending NewsRabi Maize: మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం

Rabi Maize: మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం

యాసంగి మొక్కజొన్న కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా సాగు చేసే మొక్క జొన్న ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలో తక్షణం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

యాసంగిలో దాదాపు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయగా 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉంది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ప్రధానంగా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మొక్కజొన్న క్వింటాలుకు ప్రభుత్వ మద్దతుధర రూ.1962గా నిర్ణయించింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్