తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో 2 వ పీఆర్సీ ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోజు ఉదయమే సచివాలయానికి వెళ్ళిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై సుదీర్గంగా చర్చిస్తున్నారు. మొదట రాష్ట్రంలో వరదలు, వానలపై అధికారులతో సమీక్షించారు.ప్రాజెక్టులు, నదుల వద్ద సహాయక బృందాలను 24 గంటలు అప్రమత్తంగా ఉంచాలని సిఎం ఆదేశించారు.
ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారులతో చర్చించినట్టు సమాచారం. ఇంటెరిం రిలీఫ్ [IR] కూడా ప్రకటించనున్న ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం [EHS] పై కూడా నిర్ణయం. ఈహెచ్ఎస్ అమలుకు విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌజింగ్ పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టిఎన్ జీవో లకు హౌసింగ్ సొసైటీ కోసం త్వరలోనే గచ్చిబౌలి భూమి కేటాయిస్తామని మంత్రి కేటిఆర్ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారని విశ్వసనీయ సమాచారం.