ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం అని ప్రమాణం. అలా ఆఫ్ఘన్ చిత్రాలు ఇప్పుడు లక్ష మాటలతో సమానం. ఒక్కో చిత్రానిది ఒక్కో కథ.
పాక్- ఆఫ్ఘన్:-
ఈనాటి ఈ బంధమేనాటిదో?
ఎక్కడయినా చూశారా:-
విమానం టైరు పట్టుకుని అయినా దేశం దాటి ఎగిరిపోవాలి.
ఎగిరిపోలేక:-
దేశం దాటితే చాలు
ఎక్కడికి పోతావు చిన్నవాడా:-
ఉంటే చావు. పొతే చావు. పోలేక చావు.
అగ్గికి ఆజ్యం:-
ఆఫ్ఘన్ లో రష్యా పెట్టిన చిచ్చు
కూల్చుడే కూల్చుడు:-
విమానాలను కూల్చడం ఏమన్నా రాకెట్ సైన్సా?
విధ్వంసక విద్య:-
ఆరుబయట పాఠాల బోధన
విమానం మానం పోయింది:-
విమానం రెక్కల కింద సేద తీరాలి. విమానం ఎగిరితే ఎగిరిపోవాలి. బతికి ఉంటే దేశం దాటాలి.
మాటల్లేవ్…తూటాలే:-
ఒరేయ్!
చాయ్ చెప్పి ఎంత సేపయ్యిందిరా?
అమెరికా సైన్యం- అయోమయం:-
ఎందుకొచ్చామో?
ఎందుకు వెనక్కు వెళుతున్నామో?
వస్తా వట్టిది- పోతా వట్టిది:-
ఆఫ్ఘన్ కు ప్రాణంతో నిటారుగా వచ్చి;
ప్రాణం లేకుండా పెట్టెలో పడుకుని వెళ్లే ఒకానొక అమెరికా సైనికుడు
బాస్ ఈజ్ బ్యాక్:-
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బుల్లెట్ పాయింట్లు రెడీ చేయాలి.