Saturday, November 23, 2024
HomeTrending Newsకాశీ ఆలయ కారిడార్ నేడు ప్రారంభోత్సవం

కాశీ ఆలయ కారిడార్ నేడు ప్రారంభోత్సవం

Kashi Temple Corridor : ప్రధానమంత్రి నరేంద్రమోడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ రోజు నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాశీ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఈ (కారిడార్)నడావ… ఆలయాన్ని గంగా ఘాట్‌లతో కలుపుతుందని, దీని కొలతలు 320 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌లో మ్యూజియం, లైబ్రరీ, యాత్రికుల వసతి కేంద్రం, ముముక్ష భవన్ వంటివి ఉండనున్నాయి. కాశీ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ ద్వారా నిర్వాసితులైన 400 కుటుంబాలతో కలిసి ప్రధాని దీనిని ప్రారంభించనున్నాఋ. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కారిడార్ ప్రారంభోత్సవం ప్రాధాన్యత సంతరించుకుంది.

కారిడార్‌కు సాంస్కృతిక, రాజకీయాల రీత్యా ప్రాధాన్యత ఉంది. చారిత్రకంగా చూస్తే ఇందోర్‌కు చెందిన హోల్కర్ రాణి అహల్యా బాయి హోల్కర్ గంగా ఘాట్ వరకు అనేక మందిరాలు, సుందర దృశ్యాలు(విస్టాస్) నిర్మించారు. దేశంలోని అన్ని నదుల నీటిని బాబా విశ్వనాదుడి అభిషేకించడానికి తీసుకొచ్చారు. చారిత్రక గుడిపై ఓ సౌండ్ అండ్ లేజర్ షో కూడా ఉంటుంది. 2018లో మోడీ రూ. 600(సుమారుగా) కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అందులో రూ. 300 కోట్లు భూమిని, గుడి చుట్టుపక్కల ఉన్న భవనాలు వంటి వాటికి పరిహారాలు చెల్లించడానికి ఖర్చయిందని సమాచారం.

ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తొమ్మిది రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులతో పాటు సాదు, సంతువులను ఆహ్వానించారు.మరోవైపు సమాజ్ వాది పార్టీ అధికారంలో ఉన్నపుడే నిధుల మంజూరు జరిగిందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ప్రధానమంత్రికి  ప్రచారం చేసుకోవటం తప్పితే నిజాలు చెప్పటం తెలియదని విమర్శించారు.

Also Read : కాశీలో మూడు రోజులు దర్శనాలకు బ్రేక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్