Sunday, January 19, 2025
HomeTrending Newsతాళాలు పగులగొట్టి  గృహప్రవేశాలు

తాళాలు పగులగొట్టి  గృహప్రవేశాలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగులగొట్టి లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు. ఏడాదికిందటే ఇళ్ల నిర్మాణం  కాంట్రాక్టర్ పూర్తి చేయగా జిల్లా అధికారులు పరిశీలించి గత సంవత్సరం దసరా పండుగకు లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారని తీరా అది జరుగకపోవడంతో అగ్రహించిన లబ్దిదారులు తాళలు పగుళగొట్టారు. మల్యాల మండలం నూకపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం 65 మంది ఇళ్ళు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మాణం చేపట్టి పూర్తిచేసింది. 2020 దసరా పండుగకు లబ్దిదారులకు అప్పజెప్పడం జరుగుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు.ఇళ్ళు పూర్తయిన అధికారులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళ్ళు వారికీ అప్పజెప్పకపోవడంతో  గుడిసెల్లో ఉంటు ఇబ్బందులు పడుతున్నామని లబ్దిదారులు ఎమ్మెల్యే, అధికారులు మాటను నిలుపుకోలేదని భావించి కోపంతో శుక్రవారం 19 ఇళ్ల తాళలు పగులగొట్టి గృహప్రవేశం చేశారు. ఇళ్లను శుభ్రం చేసుకొని అక్కడే ఉన్నారు.

విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి అడుగగా  గత ఏడాదే  చొప్పదండి ఎమ్మెల్యే మాకు అప్పాజెప్పుతామణి చెప్పాడని, ఇక మీరు చేయరనే మేమే ఇళ్లలోకి ప్రవేశించామని,మేము ఇళ్ళు ఖాళీ చేసే ప్రశక్తే లేదని లబ్దిదారులు తెల్చిచెప్పారు. దీంతో నూకపల్లి కాలనిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగ పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్