Sunday, January 19, 2025
Homeసినిమా'ఏజెంట్' ఈసారైనా వస్తుందా..?

‘ఏజెంట్’ ఈసారైనా వస్తుందా..?

అఖిల్ నటిస్తున్న మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇక అఖిల్ కు జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. ఈ మూవీ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది కానీ.. కొన్ని కారణాల వలన ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ చిత్రాన్ని2021 డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత 2022 ఆగష్టులో రిలీజ్ అని ప్రకటించారు కానీ.. రాలేదు. ఆతర్వాత 2022 డిసెంబర్ లో ఏజెంట్ రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. అప్పుడు డిసెంబర్ లో కాదు.. 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అని ప్రకటించారు. ఇలా ప్రకటించిన కొన్ని రోజులకే సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుందనే వార్త బయటకు వచ్చింది. ఇలా ఎన్నో సార్లు వాయిదాపడిన ఏజెంట్ మూవీ గురించి న్యూయర్ సందర్భంగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల జరిగిన నైట్ షూట్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

ఇటీవలే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లు టీమ్ వెల్లడించింది. రిలీజ్ చేసిన గ్లింప్స్ లో అఖిల్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం 2023 వేసవిలో విడుదల కానుందని మేకర్స్ కూడా ధృవీకరించారు. మమ్ముట్టి ఈ స్పై థ్రిల్లర్‌లో పోషిస్తున్న కీలక పాత్ర మూవీకి హైలెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఏకె ఎంటర్టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్‌ల పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి.. సమ్మర్ లో అయినా వస్తుందో లేదో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్