కేజీయఫ్ అనే పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం సాధించడం అనేది అరుదైన విషయం.

కాంతార‘ చిత్రం విడుదలైన పదిహేడవ రోజు కూడా 90 శాతం కలక్షన్స్ పెరగడం అనేది చిత్రం విజయానికి నిదర్శనం. కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్ ద్వారా తెలుగులో విడుదల చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది కాంతార. కంటెంట్ బాగుంటే.. అందులో స్టార్ హీరో లేక‌పోయినా సినిమాను ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపించింది.

రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ కాంతార క్లైమాక్స్ గురించి చెప్పాలంటే మాట‌ల్లో చెప్ప‌లేం తెర పై చూడాల్సిందే అంటున్నారు సినీజ‌నాలు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగులో కూడా అంతకు మించిన విజయఢంకాను మోగిస్తుండడం గమనార్హం.

Also Read :

అతడు అడవిని జయించాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *