Saturday, January 18, 2025
Homeసినిమాసరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్‌

సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్‌

మహేష్ బాబు.. నటశేఖర్ కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.’రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్‌ బాబు కెరీర్ ఆరంభంలో ‘మురారి’, ‘ఒక్కడు’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్స్ వచ్చినప్పటికీ.. తెలుగు సినిమాలంటేనే ఇష్టమని.. తెలుగులోనే సినిమాలు చేస్తానని చెప్పిన టాలీవుడ్ స్టార్ మహేష్‌ బాబు.

తన సినిమాల గురించి.. పర్సనల్ విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చే మహేష్ బాబుకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ లో మహేష్‌ బాబు అరుదైన ఫీట్ సాధించారు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్.. ఇప్పుడు ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సౌత్ ఇండియన్ యాక్టర్ గా నిలిచాడు. లేటెస్టుగా ట్విట్టర్ లో మహేష్ బాబుని ఫాలో అయ్యే వారి సంఖ్య 13 మిలియన్లు దాటింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇంత మంది ఫాలోవర్స్ ఉన్న మరో హీరో లేడని చెప్పాలి.

2010 ఏప్రిల్ లో మహేష్ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసారు. ఇప్పటి వరకూ ఆయన 30 మందిని మాత్రమే ఫాలో అవుతుండగా.. అందులో 10 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో మహేష్‌ కు 9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్ తో భారీ చిత్రంలో నటిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత వీరి కలయికలో వస్తున్న మూడవ చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత రాజమౌళితో మహేష్‌ బాబు పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఇది యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఈ సినిమాతో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్