Monday, January 20, 2025
HomeTrending Newsనల్ల చట్టాల రద్దు రైతుల విజయం

నల్ల చట్టాల రద్దు రైతుల విజయం

The Prime Ministers Statement Is A Victory For The Farmers :

మూడు రకాల వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు  ప్రధాని మోడీ ప్రకటించడం హర్షణీయమని మాజీమంత్రి, కాంగ్రెస్  సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఇందిరాగాంధి జయంతి వేడుకల్లో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నల్ల చట్టాల రద్దు అంశం, ఇది ముమ్మాటికీ రైతుల విజయమన్నారు. ఏడాది కాలంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న దృష్ట్యా ఆలస్యంగానైనా కొత్త వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం ప్రకటించడం పట్ల  ప్రధాని మోడిని అభినందించారు. ఆలస్యంగానైన మోడి వాస్తవాలను గ్రహించారన్నారు.

చట్టాల రద్దుతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు కల్పించాలని జీవన్ రెడ్డి కేంద్రానికి  సూచించారు. నల్ల చట్టాల విషయంలో అకాలిధళ్ పార్టీ బిజీపి కూటమి నుంచి వైదొలిగి రైతుల పక్షాన నిలిచి పోరాటం చెయడం అభినంధనియమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాల విషయంలో దోబుచులాడిందని, వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయలేదని విమర్శించారు.

రాష్ట్రం ప్రభుత్వం రైతుల విషయంలో భేషజాలకు పోకుండా,రైతులు పండించిన  వరి ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. ధర్నాలు చేయడం కాదు కల్లాల వద్దకు వెళ్లి కొనుగోళ్లు ఆరంబించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అమలు చేయాలని, జిల్లా రెవెన్యూ యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులకు భరోసా కల్పించాలన్నారు.

వ్యవసాయ చట్టాలు రైతులకు అవరోధంగా ఉన్నాయని భావించిన రైతులు సంఘటితంగా ఉండి పోరాటం చేయడంతోనె కేంద్రం రద్దు చేసిందని ఇది  ఏ రాజకీయ పార్టీ విజయం కాదని  కేవలం రైతుల విజయమని జీవన్ రెడ్డి పునరుద్ఘారించారు.

ఈ సంధర్బంగా జగిత్యాల పట్టణంలో రైతుల పక్షాన నల్ల చట్టాల రద్దు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్,  నాయకులు బండ శంకర్,  కొత్త మోహన్,ధుర్గయ్య,నక్క జీవన్,దేవేందర్ రెడ్డి, మన్సుర్ ఆలీ, నెహాల్ మున్నా,రాధాకిషన్ అశోక్ తదితరులున్నారు.

సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొత్త మొహాన్,బండ శంకర్,దేవేందర్ రెడ్డి,ధుర్గయ్య, కొండ్ర జగన్,అశోక్, బింగి రవి, అల్లాల రమేశ్ రావు, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read :

రైతు చట్టాలు రద్దు: మోడీ ప్రకటన

RELATED ARTICLES

Most Popular

న్యూస్