Saturday, March 15, 2025
HomeTrending NewsJPS Strike: జిపిఎస్ లను చర్చలకు పిలవలేదు - మంత్రి ఎర్రబెల్లి

JPS Strike: జిపిఎస్ లను చర్చలకు పిలవలేదు – మంత్రి ఎర్రబెల్లి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున తాను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని తెగేసి చెప్పారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె ను వారు వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధమని, అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దన్నారు.

ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందని మంత్రి హితవు పలికారు. ప్రభుత్వాన్ని శాసి0చాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పన్నారు. JPS లు సమ్మె విరమిస్తే, సీఎం వారికి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం చట్ట విరుద్ధమన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధమని, సంఘాలు కట్టబోమని, యూనియన్ లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్ల కు దిగబోమని వారు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారని గుర్తు చేశారు.

ఇప్పటికైనా మించిపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే సమ్మె ను వివరించాలి. విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హితవు తో కూడిన సూచన, విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్