బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘బాహుబలి’ రేంజ్ లో రూపొందించిన భారీ చిత్రం బ్రహ్మాస్త్రం. ఇందులో రణ్ భీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించగా, దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడంతో బ్రహ్మస్త్రం మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మస్త్రం’ ఈ నెల 9న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా బ్రహ్మస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లో రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేశారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తెలంగాణ పోలీసులు ఈవెంట్ కు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏంటంటే.. గణేష్ నిమజ్జనం వలన పర్మిషన్ ఇవ్వలేమని.. అందుకే క్యాన్సిల్ చేసినట్టు తెలంగాణ పోలీసులు చెప్పారు.
అయితే.. ఇటీవల ఎన్టీఆర్ అమిత్ షాని కలవడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా ఉంది. మోడీతో కేసీఆర్ ఢీ అంటే ఢీ అంటున్నారు. అందుచేతనే ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీలోనూ రాజకీయ వర్గాల్లోనూ దీని పై చర్చ మొదలైంది. ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో బ్రహ్మస్త్రం టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. అందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “పోలీసుల నిర్ణయాన్ని గౌరవించాలి. వాళ్లు మన రక్షణ గురించి బాధ్యత తీసుకుంటార”న్నారు. మరి.. ఇకనైనా బ్రహ్మస్త్రం ఈవెంట్ క్యాన్సిల్ వెనుక రాజకీయ కోణం అనే చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.