Saturday, January 18, 2025
Homeసినిమాచ‌ర‌ణ్‌, గౌత‌మ్ మూవీ ఆగిపోవ‌డానికి కార‌ణ‌మిదే!

చ‌ర‌ణ్‌, గౌత‌మ్ మూవీ ఆగిపోవ‌డానికి కార‌ణ‌మిదే!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించారు. దీంతో చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ ఏంటి అనేది ముఖ్యంగా నార్త్ లో ఆస‌క్తిగా మారింది. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో చ‌ర‌ణ్ భారీ పాన్ ఇండియా మూవీ చే్స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. చాలా ఫాస్ట్ గా షూటింగ్ జ‌రుపుకుంటుంది అనుకుంటే.. ‘ఇండియ‌న్ 2’ షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ చేయాల్సి రావ‌డంతో శంక‌ర్ చ‌ర‌ణ్ మూవీ షూటింగ్ కి బ్రేక్ ప‌డింది.

శంక‌ర్ ఇండియ‌న్ 2 షూటింగ్ చేయ‌డంతో చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్నారు. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరితో చ‌ర‌ణ్ మూవీ చేయాలి అనుకున్నారు. ఈ మూవీ గురించి అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది కానీ.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఎందుక‌ని ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అనేది ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… గౌత‌మ్ చెప్పిన స్టోరీ చ‌ర‌ణ్ కి న‌చ్చింద‌ట‌. వెంట‌నే ఫుల్ స్టోరీ రెడీ చేయ‌మ‌న‌డం.. ఫుల్ స్టోరీ విని కూడా ఓకే చెప్పార‌ట‌.

అయితే.. జెర్సీ హిందీలో ప్లాప్ అయిన త‌ర్వాత చ‌ర‌ణ్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. ఒక‌సారి నాన్న గారికి క‌థ చెప్పండ‌ని గౌత‌మ్ ని చిరంజీవి ద‌గ్గ‌ర‌కు పంపించార‌ట‌. అయితే.. గౌత‌మ్ చెప్పిన క‌థ విని చిరు సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. చ‌ర‌ణ్ కి న‌చ్చినా చిరుకు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల‌నే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ కోసం క‌థ‌లు వింటున్నారు. మ‌రి.. ఏ డైరెక్ట‌ర్ కి చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్